NTV Telugu Site icon

అమెరికాలో కోవాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్..

COVAXIN

ఐసీఎమ్‌ఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే.. యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ భాగస్వామ్యంతో కోవాగ్జిన్ను అమెరికాలో సరఫరా చేసేందుకు భార‌త్ బ‌యోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.. అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి కోర‌గా ఎఫ్‌డీఏ నిరాక‌రించింది. మరింత అదనపు సమాచారాన్ని కోరింది.. అయితే, కోవాగ్జిన్ కోసం మార్కెటింగ్ అనువ‌ర్త‌నానికి మ‌ద్ద‌తుగా అమెరికాలో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు భార‌త్ బ‌యోటెక్ ప్ర‌క‌టించింది.