Site icon NTV Telugu

Bhagwant mann: పంజాబ్ సీఎం మార్పుపై భగవంత్ మాన్ ఏమన్నారంటే..!

Bhagwantmann

Bhagwantmann

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. దాదాపు 35 మంది ఆప్ ఎమ్మెల్యేలు గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్‌సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఆప్ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులంతా సమావేశం అయ్యారు. కపుర్తలా హౌస్‌లో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై కేజ్రీవాల్ చర్చించారు.

ఇక సమావేశం అనంతరం భగవంత్‌ మాన్‌ను మీడియా ప్రతినిధులు పలకరించారు. పంజాబ్ సీఎం మార్పు జరుగుతుందంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాబోతున్నారంటూ ప్రశ్నించారు. దీనికి భగవంత్ మాన్ నవ్వుతూ తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Bird Flu Effect: చికెన్ ప్రియులకు పండగే.. కిలో రూ. 30 మాత్రమే!

సమావేశం అనంతరం లూథియానా సెంట్రల్ ఎమ్మెల్యే అశోక్ ప్రషార్‌ మాట్లాడుతూ… పంజాబ్‌లో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై కేజ్రీవాల్ దిశానిర్దేశం చేశారని చెప్పారు. పంజాబ్‌లో ఎటువంటి ముఖ్యమంత్రి మార్పు ఉండదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్‌కు 93 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Sai Dharam Tej: ఈ పూటకు భోజనం చేస్తే చాలు అనుకుంటా!

Exit mobile version