NTV Telugu Site icon

Bhagavad Gita: భగవద్గీతకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోడీ హర్షం

Pmmodi

Pmmodi

భగవద్గీత, నాట్య శాస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు లభించింది. ఈ విషయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు. భారతీయ మేధో మరియు సాంస్కృతిక గుర్తింపునకు స్తంభాలుగా అభివర్ణించారు. ఇది భారతీయులందరికీ గర్వకారణమైన క్షణం అని ప్రధాని స్పష్టం చేశారు. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం’ అని షెకావత్ అభివర్ణించారు.

Pm

Pm