NTV Telugu Site icon

Best Teacher Awards: నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం..

Droupdi

Droupdi

Best Teacher Awards: ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల జాతీయ ఉపాధ్యాయుల అవార్డు 2024కు ఎంపిక చేసిన 82 మంది అవార్డు గ్రహీతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ అవార్డులను ప్రధానం చేయబోతున్నారు. కాగా, విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం.. 28 రాష్ట్రాల నుంచి 50మంది ఉపాధ్యాయులు, 3 యూటీలు, 6 సంస్థల నుంచి ఎంపికయ్యారు. ఎంపికైన ఉపాధ్యాయుల్లో 34 మంది పురుషులు ఉండగా.. 16 మంది మహిళలు, ఇద్దరు వికలాంగులు, ఒకరు ప్రత్యేక అవసరాలు (CWSN) గల పిల్లలతో పని చేస్తున్నారు.

Read Also: America Elections : అమెరికా ఎన్నికల్లో రష్యా ప్రవేశం! ఓటర్లపై కుట్ర జరుగుతోందని ఆరోపణ

ఇంకా, అదనంగా, ఉన్నత విద్యా శాఖ నుంచి 16 మంది ఉపాధ్యాయులు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్ మంత్రిత్వ శాఖ నుంచి మరో 16 మంది టీచర్స్ కు కూడా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్నారు. ఇప్పటికే అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి అవార్డుకు మెరిట్ సర్టిఫికెట్ తో పాటు రూ. 50,000 నగదు, రజత పతకం అందించనున్నారు. అవార్డు గ్రహీతలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది.

Show comments