NTV Telugu Site icon

Driverless Train: దేశంలో తొలి డ్రెవర్ లెస్ మెట్రో రైల్.. బెంగళూర్‌లో ప్రారంభం..

Bengaluru,

Bengaluru,

Driverless Train: దేశంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైల్ పరుగులు తీయబోతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూర్‌లో డ్రైవర్ లెస్ ట్రైన్ కొన్ని రోజుల్లో పని ప్రారంభించనుంది. బెంగళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ లోని ఎల్లో లైన్‌లో 19 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు నడుస్తుందని తెలిపారు. ఆరు కోచుల రైలు జనవరి 20న చైనా నుంచి చెన్నైకి బయలుదేరింది. 2024 మధ్య లేదా ఫిబ్రవరి చివరినాటికి చెన్నై పోర్టుకు చేరబోతోంది. నిజానికి ఇది సెప్టెంబర్ 2023 వరకే రావాల్సి ఉంది. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 75 శాతం స్థానిక ఉత్పత్తి అవసరాలను కనుగొనడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆలస్యం అయింది. దీనికి తోడు కోవిడ్-19, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి విధానాలు, చైనాతో వాణిజ్య పరిమితులు వంటి అంశాలు కూడా జాప్యానికి కారణమయ్యాయి.

Read Also: Bihar political crisis: రంగంలోకి సోనియాగాంధీ.. నితీష్‌కు ఫోన్ చేస్తే రిప్లై ఇలా..!?

చైనీస్ కంపెనీ CRRC, కోచ్‌ల తయారీ మరియు సరఫరా కోసం కోల్‌కతాకు చెందిన టిటాగర్ రైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కోచ్‌లను కోల్‌కతాకు సమీపంలోని ఉత్తర్‌పరాలోని టిటాగర్ తయారు చేస్తు్న్నారు. ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన దక్షిణ బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్స్ సిటీని కలిపే ఎల్లో లైన్ ఈ మెట్రో సేవలను అందిస్తుంది. మొత్తం కోచ్‌లలో, 126 (21 ఆరు-కోచ్ రైళ్లు) పర్పుల్ మరియు గ్రీన్ లైన్‌లలో అమర్చబడతాయి, మిగిలిన 90 కోచ్‌లు (15 ఆరు-కోచ్ రైళ్లు) ఎల్లో లైన్‌లో సేవలు అందిస్తాయి. సెప్టెంబర్ 2024లోగా ఈ రైళ్లు పట్టాలెక్కాల లక్ష్యం పెట్టుకున్నారు. రైళ్లు బెంగళూర్ చేరిన తర్వాత కొన్ని రోజుల పాటు ట్రైల్ రన్స్ నిర్వహించనున్నారు.