Acid Attacks: దేశవ్యాప్తంగా నేరాల వివరాలను వెల్లడించే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవల తన నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, యూటీల్లో నేరాల తీరును ఇందులో పేర్కొంది. 2022లో దేశంలో మహిళలపై ఎక్కువ యాసిడ్ దాడులు జరిగిన నగరాల్లో బెంగళూర్ నగరం మొదటి స్థానంలో ఉన్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.
మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాల్లో బెంగళూర్‌లోనే గతేడాది ఎక్కువ యాసిడ్ దాడులు జరిగాయి. 8 మంది మహిళలు ఈ నగరంలో యాసిడ్ దాడికి గురయ్యారు. 7 దాడులతో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 5 కేసులతో అహ్మదాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 2022లో యాసిడ్ దాడులకు ప్రయత్నించిన కేసులు ఢిల్లీలో 7 నమోదవ్వగా.. బెంగళూర్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లో రెండు కేసుల చొప్పున రికార్డయ్యాయి.
Read Also: BSP: మాయావతి వారసుడు ఖరారు.. బీఎస్పీకి కొత్త నాయకుడు..
గతేడాది 24 ఏళ్ల ఎం.కామ్ గ్రాడ్యుయేట్‌పై ఏప్రిల్ 28న జరిగిన యాసిడ్ దాడి ఆ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆమె ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో నిందితుడు దాడి చేశాడు. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో యాసిడ్ పోశాడు. నిందితుడిని మే నెలలో తిరువణ్ణామలై ఆశ్రయం నుంచి అరెస్ట్ చేశారు. స్వామీజి వేషంలో ఉన్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. యాసిడ్ బాధితురాలికి సీఎం సిద్ధరామయ్య కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం ఇచ్చారు. జూన్ 10, 2022న ఇలాంటి మరో కేసు నమోదైంది, ఇందులో కూడా ఒక వ్యక్తి తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత తన మహిళా స్నేహితురాలు ముఖంపై యాసిడ్ పోశాడు.