Site icon NTV Telugu

Bengaluru: కాంగ్రెస్ నేత వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య..

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూర్‌లో 35 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య రాజకీయ దుమారానికి కారణమైంది. బీజేపీ కార్యకర్త అయిన వినయ్ సోమయ్య అనే వ్యక్తి తన ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ కార్యకర్త టెన్నీరా మహీనా, ఎమ్మెల్యే ఎ ఎస్ సోమన్న, ఇతరుల వేధింపులే కారణమని, తప్పుడు కేసులో తనను ఇరికించినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

కర్ణాటక కొడుగు జిల్లా సోమవార్ పేట‌కు చెందిన వినయ్ ‘‘కొడగిన సమస్యేగలు’’ అనే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారు. ఈ గ్రూపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య న్యాయసలహాదారు ఏఎస్ సోమన్నపై వివాదాస్పద పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్టులో టాయిలెట్ పక్కన సాంప్రదాయ కొడవ దుస్తుల్ని ధరించి ఉన్న పొన్నప్పకు చెందిన ఎడిటెడ్ ఫోటోని షేక్ చేశారు. దీని తర్వాత ఈ ఫోటోని షేర్ చేసిన వ్యక్తితో పాటు, గ్రూప్ అడ్మిన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో మూడో నిందితుడిగా వినయ్ కూడా ఉన్నారు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత, బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో కోర్టు స్టే పొందినప్పటికీ పోలీసులు, రాజకీయ నేతల నుంచి వేధింపులు కొనసాగుతున్నట్లు వినయ్ ఆరోపించారు.

Read Also: POCO C71: కేవలం రూ.6,499కే 6.88 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ మొబైల్ ను తీసుకొచ్చిన పోకో

‘‘గత రెండు నెలలుగా, నా మనసు నా నియంత్రణలో లేదు. వాట్సాప్ గ్రూపులో ఒక వ్యక్తి అభ్యంతర పోస్ట్ చేశాడు. ఐదు రోజుల క్రితం అడ్మిషన్‌గా ఉన్న నన్ను దీనికి బాధ్యుడిని చేశారు. నాపై రాజకీయ ప్రేరేపితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేవారు. సమాజంలో నన్ను దుర్మార్గుడిగా ముద్ర వేశారు. రాజకీయ ద్వేషంతో నా జీవితంతో టెన్నీరా మహీనా ఆడుకున్నారు. నా మరణానికి అతడే బాధ్యత వహించాలి’’ అని వినయ్ తన ఆత్మహత్య లేఖలో రాశాడు. అధికారులు తనను రౌడీ షీటర్‌గా ముద్ర వేయడానికి ప్రయత్నించారని వినయ్ ఆరోపించాడు. తన కుటుంబాన్ని బీజేపీ నాయకులు ఆదుకోవాలని లేఖలో కోరాడు. ఈ ఆత్మహత్య వ్యవహారంపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర ఈ విషయంపై డీసీపీ స్థాయి దర్యాప్తుకు హామీ ఇచ్చారు.

Exit mobile version