NTV Telugu Site icon

Cab Driver Extorts: ఫోన్‌లో ‘ఎఫైర్’ మాటలు విన్నాడు.. మహిళని బెదిరించి 22 లక్షలు దోచేశాడు

Cab Driver Extorts

Cab Driver Extorts

Bengaluru Cab Driver Extorts 22 lakh Gold jewelry From Woman After Overhearing Phone Conversation: బెంగళూరులో ఒక విచిత్రమైన దోపిడీ జరిగింది. ఫోన్‌లో ఒక మహిళ మాట్లాడిన ‘ఎఫైర్’ మాటలు విని.. క్యాబ్ డ్రైవర్ ఆమెను బెదిరించి, రూ.22 లక్షలు దోచేశాడు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హర్సగట్టకు చెందిన కిరణ్ ఒక క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వివాహిత.. ఇంద్రానగర్ నుంచి బనస్వాడాకి ఒక క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో.. ఆ మహిళ తన ఫోన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న మాటల్ని విన్నాడు.

Russia Crime: దారుణం.. యువతిని 14 ఏళ్లు బంధించి, 1000 సార్లకు పైగా అత్యాచారం

కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ కిరణ్ ఆమెకు ఒక మెసేజ్ చేశాడు. తనని తాను చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌గా పరిచయం చేసుకున్న అతను.. తాను ఆర్థిక సమస్యల్లో ఉన్నానని, కొంచెం డబ్బు అవసరం ఉందని అడిగాడు. అప్పుడు ఆమె వెంటనే అతని బ్యాంక్ అకౌంట్‌కి రూ.22 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. కొన్ని రోజులు గడిచాక అతడు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ కాదని తెలుసుకున్న ఆ మహిళ.. అతనితో మాట్లాడటం మానేసింది. కానీ.. కిరణ్ మాత్రం ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు చేయకపోతే.. నీకు మరొకరితో ఎఫైర్ ఉందన్న విషయం నీ భర్తకు చెప్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆమె.. అతడు అడిగినట్లుగానే ఈ నెల ఏప్రిల్‌లో తన బంగారం (750 గ్రాములు) మొత్తం ఇచ్చేసింది.

Aashika Bhatia: అవును.. నాకు ఆ ‘పాడు’ అలవాటు ఉంది.. అమ్మకి కూడా తెలుసు

కొన్ని రోజులు గడిచాక ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో.. భర్త ఆమెను నిలదీశాడు. అప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ గురించి ఆమె తన భర్తకు వివరించింది. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్‌లో ఆ క్యాబ్ డ్రైవర్‌పై ఫిర్యాదు నమోదు చేసింది. తనని బెదిరించి రూ.22 లక్షలతో పాటు 750 గ్రాముల బంగారం దోచుకున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. క్యాబ్ డ్రైవర్ కిరణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Show comments