NTV Telugu Site icon

Bengaluru Auto Driver: ఆటోడ్రైవర్ తిక్క కుదిరింది.. రైడ్ క్యాన్సిల్ రూ. 30తో పోయేది, ఇప్పుడు లీగల్ ఫీజులే రూ. 30,000

Bengaluru Auto Driver

Bengaluru Auto Driver

Bengaluru Auto Driver: ఇటీవల బెంగళూర్‌కి చెందిన ఓ ఆటోడ్రైవర్ వీడియో తెగ వైరల్ అయింది. రైడ్ క్యాన్సిల్ చేసిందనే కోపంలో సదరు ఆటో డ్రైవర్ మహిళని కొట్టడమే కాకుండా, దుర్భాషలాడాడు. ఆమె ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. పొరపాటున రైడ్ క్యాన్సిల్ అయిందని మహిళ చెబుతున్నా వినకుండా, ‘‘ గ్యాస్ డబ్బులు మీ నాన్న ఇస్తాడా..?’’ అంటూ నడిరోడ్డుపై మహిళ అని చూడకుండా హల్చల్ చేశాడు. ఇతర డ్రైవర్ల నచ్చ చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇలా దుర్భాషలాడుతున్న సమయంలో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని చెబుతే, తాను భయపడనని తనతో పాటు పోలీస్ స్టేషన్ రావాలని సవాల్ చేశాడు. తన వద్ద నీ ఫోన్, ఆటో వివరాలు ఉన్నాయని మహిళ చెప్పిన సందర్భంలో ఆమెని చెంపదెబ్బ కొట్టాడు.

Read Also: Rajasthan: రాళ్లు వెనకేసుకోవడం అంటే ఇదేనేమో.. వ్యక్తి గాల్‌బ్లాడర్ నుంచి 6000 రాళ్లు తొలగింపు..

ఈ వీడియో వైరల్ కావడం, దీనిని పోలీసు అధికారులు చూడటంతో ఓలా డ్రైవర్ ఆర్.ముత్తురాజు‌ని గురువారం మగాడి రోడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 మరియు 352 కింద అభియోగాలు మోపారు. బెయిల్‌కి దరఖాస్తు చేసుకునే ముందు అతను నాలుగు రోజులు జైల్లో గడపాల్సి ఉంటుంది. ఇక లీగర్ ఫీజుల కోసం ఏకంగా రూ. 30,000 చెల్లించాల్సి వస్తుంది. రైడ్ క్యాన్సిల్ అయితే కేవలం రూ. 20-రూ. 30తో పోయేది. అంతకన్నా ఎక్కువ ఇంధన ఖర్చులు అయ్యేవి కావు. ప్రస్తుతం ఏకంగా వేలకువేలు చెల్లించాల్సి వస్తోంది.

వైరల్ అయిన వీడియోని సీనియర్ పోలీస్ అధికారి చూడటం.. ఇది ఆమోదయోగ్యం కాదని, మోసపూరితమైన చర్య అని, ఒక యువతిని పట్టపగలు నిందితుడు మాటలతో దుర్భాషలాడాడని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన స్పందించడంతో పోలీసులు చకచకా చర్యలు తీసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. రైడ్ క్యాన్సిల్ కావడంతో తాను కోపంలో ఉన్నానని డ్రైవర్ ఒప్పుకున్నాడు, కానీ అతడి చర్యల్ని సమర్థించుకోలేకపోయాడు. జైలు శిక్షతో పాటు చట్టపరమైన ఖర్చులు ఎదుర్కోవడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్ రద్దు చేయబడుతాయి.

Show comments