Site icon NTV Telugu

Bengaluru: ఏందిరా మాకి రచ్చ.. ఫేమస్ అవ్వడానికి రోడ్డు మీదనే….

Untitled Design (4)

Untitled Design (4)

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి జనాలు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. రోడ్లు మధ్యలో డాన్స్ లు, రైలు పట్టాలపై పడుకోవడాలు.. నీటిలో దుంకడాలు.. ఇవ్వన్ని చూస్తుంటే.. వీళ్లని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే .. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎలాంటా పనైనా చేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ కోసం ట్రాఫిక్‌ కు అంతరాయం కలగిస్తున్నారు. లేకపోతే.. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో పరుపు వేసుకుని పడుకున్నాడు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి పరుపు వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఏందిరా మాకి రచ్చ అంటూ.. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఫన్నీ వీడియోగా కామెంట్లు పెటుతున్నారు.

Exit mobile version