Site icon NTV Telugu

అర్ద నగ్నంగా మంగళ సూత్రం యాడ్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

భారతదేశం వసుదైక కుటుంబం.. భారతీయులు ఆచారాలను, సాంప్రదాయాలను గౌరవిస్తారు. ముఖ్యంగా పెళ్లిని, మంగళ సూత్రాన్ని పరమ పవిత్రమని భావిస్తూ, ధరిస్తారు. ఇక వాటి గురించి వచ్చే ప్రకటనలు కూడా అంతే పద్దతిగా ఉంటాయి. నగలు, ఆభరణాల యాడ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అందులోను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ అంటే ఎంతో పాపులర్. కానీ, ప్రస్తుతం ఆయన తీసిన యాడ్ విమర్శల పాలయ్యింది. ఆచారాలను, సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

అంతగా ఆ ఫోటోషూట్ లో ఏముంది..? అంటే భారతీయ మహిళలు ఎంతో పవిత్రంగా చూసే మంగళ సూత్రం యాడ్ ని.. మహిళలతో, లో దుస్తులు వేయించి షూట్ చేశాడు. వారు తమ భర్తలతో ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు.. ఎలాంటి దుస్తులు వేసుకుంటారో అలాంటి దుస్తులలో, మెడలో మంగళ సూత్రంతో భర్తను హత్తుకున్నట్లు పోజిచ్చారు. ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇదేం ఫోటో షూట్ రా బాబు.. సిగ్గుందా మీకసలు అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది ప్రమోషన్ మోజులో సాంప్రదాయాలను మారుస్తున్నారని ఏకిపారేస్తున్నారు.  ‘ఇంటిమేట్ ఫైన్ జువెలరీ’ పేరుతో విడుదల చేసిన ఈ ఆభరణాల సేకరణ ఫోటో షూట్ వెంటనే డిలీట్ చేయాలని నెటిజన్స్ మండిపడుతున్నారు.

Exit mobile version