Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్‌లో అల్లర్లు
- రాష్ట్ర వ్యాప్తంగా అల్లరి మూకలు విధ్వంసం
- అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద శక్తిగా నిలిచింది. అయితే ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి. టీఎంసీ కార్యాలయాలు, ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై కొన్ని గుంపులు రణరంగం సృష్టిస్తున్నాయి. అయితే బీజేపీనే ఈ దాడులకు ఉసిగొల్పుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ కీలక ప్రకటన విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ‘గుండా వాహిని’ పేరుతో కొంతమంది వ్యక్తులు బీజేపీ కార్యకర్తలుగా నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ‘‘అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది నిస్సందేహంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి మోసాన్ని బీజేపీ సహించదు.’’ అని ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ఇలాంటి మోసపూరిత చర్యలను ఏ మాత్రం సహించబోమని తెలిపింది. బీజేపీ పేరుతో వేషధారణ చేసి, భయభ్రాంతులకు గురిచేయడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టం తన సంపూర్ణ శక్తితో పనిచేస్తుందని బీజేపీ పేర్కొంది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం చట్టపాలనను పునరుద్ధరించేందుకు, బాధ్యతను నిర్ధారించేందుకు, ప్రతి పౌరుడిని భయభ్రాంతులు లేకుండా రక్షించేందుకు కట్టుబడి ఉందని వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 207 స్థానాల్లో గెలిచింది. టీఎంసీ 80 సీట్లలో విజయం సాధించింది. అయితే ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం మే 7తో ముగియనుంది. అనంతరం గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించే అవకాశం ఉంది.
West Bengal BJP issues a statement – "It has come to our notice that elements of the Trinamool's so-called "Gunda Vahini" are attempting to impersonate BJP workers to mislead people and create disorder. Let it be stated unequivocally: the BJP will not tolerate such deception.… pic.twitter.com/Wic9GnhM9C
— ANI (@ANI) May 6, 2026
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!