Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలిస్తే, మన పరిస్థితి ఏంటి.? బంగ్లాదేశ్ ఆందోళన..

  • బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని బంగ్లాదేశ్‌లో భయం..
  • అక్రమ వలసదారులు బంగ్లాకు వస్తారని ఆందోళన..
  • వలసదారుల్ని భారత్ వెనక్కి నెట్టేస్తుందని ఎంపీ వ్యాఖ్యలు..
Bjp Bangladesh

Bjp Bangladesh

Bangladesh: వెస్ట్ బెంగాల్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై మన దేశంలోనే కాదు, సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్‌లో కూడా ఆసక్తిగా మారింది. ఎంతలా అంటే, బీజేపీ గెలిస్తే తమ పరిస్థితి ఏంటని ఆ దేశంలో కొందరు రాజకీయ నాయకులు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. బంగ్లాదేశ్ ఎన్‌సీపీ కార్యదర్శి, ఎంపీ అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం సాధిస్తే, అక్రమ బంగ్లాదేశీయులను బంగ్లాదేశ్‌కు సాగనంపే ప్రక్రియ మొదలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, లక్షలాది మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్‌లోకి నెట్టివేయబడే అవకాశం ఉందని, ఇది ఢాకాలో శరణార్థుల సంక్షోభాన్ని పెంచుతుందని బంగ్లా నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్‌లో బీజేపీ గెలుపు అక్రమ బంగ్లాదేశీయుల్ని భారత్ నుంచి పంపించేందుకు దారితీయొచ్చని అన్నారు. బంగ్లాదేశ్‌లోకి సముద్రంలా వలసలు వచ్చి పడుతాయని, భారత్ నుంచి ముస్లిం వలసదారుల్ని వెనక్కి పంపరనే గ్యారెంటీ లేదని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ నాయకుడి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. అక్రమ చొరబాట్లపై టీఎంసీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తృణమూల్ సహాయకులు నెమ్మదిగా తెరపైకి వస్తున్నారని అన్నారు. అక్తర్‌కు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.