Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య మధ్యప్రదేశ్ ఎన్నికలు చిచ్చుపెట్టాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్, మాట తప్పిందని ఎస్పీ చీఫ్, ఉత్తర్ ప్రదేవ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇరు పార్టీల మధ్య విమర్శలు తలెత్తాయి. లక్నోలోని కాంగ్రెస్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది.
2024లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ బ్యానర్ ఏర్పాలటు చేసింది. దీంతో పాటు 2027 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అజయ్ రాయ్ అంటూ కాంగ్రెస్ బ్యానర్‌లో పేర్కొంది. అంతకుముందు ఎస్పీ కూడా కాబోయే ప్రధాని అఖిలేష్ యాదవ్ అంటూ ఇదే విధంగా పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే రాహుల్ గాంధీ బ్యానర్ దర్శనమిచ్చింది.
Read Also: Encounter: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. చొరబాటు యత్నం భగ్నం
దీనిపై ఎస్పీ అధికార ప్రతినిధి ఫక్రుల్ హసన్ చాంద్ స్పందించారు. ఇలా ఎన్ని పోస్టర్లు అంటించినా తమకు పట్టింపు లేదని, వెనబడిన, దళిత, మైనారిటీ అంతా తమ పార్టీ వైపే ఉన్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే అధికార బీజేపీ ఇరు పార్టీలు కలలు కంటున్నాయని, ఇండియా కూటమిలో ఒకరిపై ఒకరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా దీన్ని బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని కావవాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఎస్పీకి సంబంధించిన మరో కీలక నేత హసన్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని సమాజ్ వాదీ పార్టీ ఎప్పటినుంచో చెబుతోందని ఆయన అన్నారు. ఏ పార్టీ అయిన తన సెంటిమెంట్ మేరకు పోస్టర్లు వేయొచ్చని ఆయన అన్నారు.