Site icon NTV Telugu

Bank Holidays: ఈ రాష్ట్రాల్లోనే రేపు బ్యాంకులకు సెలవు

Bank

Bank

మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. హిందువుల పండగల్లో ఒకటైన మహా శివరాత్రి పండుగ ఒకటి. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం ఉంటారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అంతేకాకుండా బ్యాంకులు కూడా సెలవులు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: Subramanian Swamy: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిల్..

ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవులు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ, గుజరాత్, జమ్మూకాశ్మీర్, మిజోరాం, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఛత్తీ‌స్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్‌లో మాత్రమే బ్యాంకులు మూసివేయబడనున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యథావిధిగా పని చేయనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కొన్ని రాష్ట్రాల్లో బుధవారం ఫిబ్రవరి 26 , మరికొన్ని రాష్ట్రాల్లో శుక్రవారం ఫిబ్రవరి 28న బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంకు శాఖలు క్లోజైనా.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు, ఏటీఎంల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇది కూడా చదవండి: Bobby Deol: అలాంటి పాత్రలు చేస్తేనే గుర్తింపు వస్తుంది: బాబీ డియల్

Exit mobile version