NTV Telugu Site icon

Bank Holidays: అక్టోబర్ నెలలో బ్యాంక్‌లకు భారీగా సెలవులు..

Oct

Oct

Bank Holidays: మరో మూడో రోజుల్లో అక్టోబర్ నెల వచ్చేస్తోంది. ఇక పండుగ సీజన్‌లో అక్టోబర్ నెల చాలా కీలకం. ఎందుకంటే ఈ నెలలో అధిక పండుగలు ఉంటాయి. అంతేకాదు ఈ నెలలోనే దసరా పండుగ కూడా ఉంది. ఇక సెలవుల జాతర వచ్చినట్లే. స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకులకు పెద్ద ఎత్తున సెలవులు వస్తాయి. ఈ క్రమంలో బ్యాంకులకు అక్టోబర్ నెలలో సెలవులు ఎన్ని రోజులు వచ్చాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దేశవ్యాప్తంగా వచ్చే నెల బ్యాంకులకు సెలవుల వివరాలు ఇవే..

Read Also: Bhumana Karunakar Reddy: జగన్‌ డిక్లరేషన్‌పై భూమన సంచలన వ్యాఖ్యలు.. ఆ హక్కు టీటీడీకి లేదు..

అక్టోబర్ 2 వ తేదీ మహాత్మా గాంధీ జయంతి ఉండగా.. 3వ తేదీ నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 6న ఆదివారం, 10న మహా సప్తమి, 11న మహా నవమి, 12వ తేదీన విజయదశమి ఉండగా 13న ఆదివారం వస్తుంది. అలాగే, 17న మహర్షి వాల్మీకి జయంతి, 20న ఆదివారం వస్తుంది. 26న బ్యాంకుల మూసివేత.. 27న ఆదివారం రాబోతుంది. ఈ నెల 29న దీపావళి, 30న ఐచ్చిక సెలవు దినం కావడంతో 31న నరక చతుర్దశి రాబోతుంది. ఈ ప్రకటనను బట్టి దేశ వ్యాప్తంగా కేవలం అక్టోబర్ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కేవలం 7 రోజుల సెలవు దినాలను మాత్రమే బ్యాంకులు ప్రకటించాయి.

* అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి
* అక్టోబర్ 10 : మహా సప్తమి
* అక్టోబర్ 11 : మహా అష్టమి
* అక్టోబర్ 12 : రెండో శనివారం, విజయదశమి
* అక్టోబర్ 13 : ఆదివారం
* అక్టోబర్ 26 : నాలుగో శనివారం
* అక్టోబర్ 27 : ఆదివారం