NTV Telugu Site icon

Bangladesh: హిందువులపై ఆగని దాడులు.. మైనారిటీ హక్కుల సంఘం ఆందోళన..

Bamgladesh

Bamgladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు ఆగడం లేదు. షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ ఎన్నికైన తర్వాత నుంచి ఆ దేశంలో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులపై టార్గెటెడ్ దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల తూర్పు సునమ్‌గంజ్ జిల్లాలోని హిందువులపై దాడి జరిగింది. ఈ దాడిని ఆ దేశంలోని అతిపెద్ద మైనారిటీ గ్రూప్ ‘‘ బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్’’ ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై వేగం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

Read Also: Devendra Fadnavis: కాంగ్రెస్ ‘ఈవీఎం’ ఆరోపణలు.. ‘లాతూర్’ ఉదాహరణ చెప్పిన సీఎం ఫడ్నవీస్

డిసెంబర్ 03 రాత్రి మంగ్లార్‌గావ్, మోనిగావ్ ఈస్ట్ గునిగ్రామ్‌లలో హిందూ సమాజానికి చెందిన వారిపై గుంపు దాడికి పాల్పడింది. 100 కన్నా ఎక్కువ ఇళ్లు, వ్యాపారాలపై దాడి చేశారు. షాపుల్ని లూటీ చేశారు. ఒక ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. మొత్తం 1.5 మిలియన్ టాకా( రూ. 10లక్షల)కు పైగా నష్టం వాటిల్లినట్లు కౌన్సిల్ వెల్లడించింది. చాలా మంది మైనారిటీలు గ్రామం వదిలి పారిపోయారు. ఫేస్‌బుక్ పోస్ట్‌ కారణంగా 20 ఏళ్ల హిందూ వ్యక్తి ఆకాష్ దాస్ దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో దాడులు జరిగాయి. ఈ దాడులకు ముందే దాస్‌ని అరెస్ట్ చేశారు.

ఇటీవల, బంగ్లాదేశ్ హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి అధికారులు దేశద్రోహం ఆరోపణలతో అరెస్ట్ చేశారు. పలువురు మైనారిటీ నాయకుల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. ఇదిలా ఉంటే, ఇస్కాన్‌కు చెందిన మరికొందరు హిందూ సన్యాసులను కూడా అక్కడి అధికారులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లోని 50 జిల్లాల్లో హిందువులపై 200 దాడులు జరిగాయి.

Show comments