Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. హిందువుల్లో భయాందోళనలు

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు ఆగడం లేదు. ఇంకా పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఖోకోన్ దాస్‌ (50) అనే వ్యాపారిని అల్లరిమూకలు కొట్టి నిప్పంటించారు. తప్పించుకునే క్రమంలో చెరువులో దూకాడు. అయినా కూడా ప్రాణం నిలబడలేదు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: US-Venezuelan: ట్రంప్ హెచ్చరికలు.. వెనిజులాలో భారీ పేలుళ్లు

ఖోకన్‌ దాస్‌.. ఔషధాలు విక్రయిస్తుంటాడు. షాపు మూసి ఆటో వెళ్తుండగా మార్గమధ్యలో దుండగులు ఆటోను ఆపి దాడి చేశారు. అనంతరం తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే రోడ్డు పక్కన ఉన్న చెరువులో దూకేశాడు. స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే తమకు ఎవరూ శత్రువులు లేరని బాధితుడి భర్య తెలిపింది.

ఇది కూడా చదవండి: Nagpur: అమానుషం.. 12 ఏళ్ల బాలుడు 2 నెలల నుంచి నిర్బంధం.. కారణమిదే!

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో యువ రాజకీయ నేత హాదీ హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హిందువులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. కొట్టి తగలబెడుతున్నారు. తాజాగా ఖోకోన్ దాస్‌ ప్రాణాలు కోల్పోయాడు.

Exit mobile version