NTV Telugu Site icon

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు.. చెట్ల కిందే డ్రగ్స్?

Rave Party Fir

Rave Party Fir

Bangalore Rave Party Drugs Case latest FIR : బెంగళూరు రేవ్ పార్టీ మాడిఫై చేసిన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్‌లో రేవ్ పార్టీ పై ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు మేరకు 11:30 కి ఫామ్ హౌస్ కి పోలీసులు చేరుకున్నారు. ఇక పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీ లోని ఫామ్ హౌజ్ లో 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ జరిగింది. మత్తు పదార్థాలను విక్రయిస్తూ.. సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందని, వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్నామని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. రేవ్ పార్టీ జరుగుతుండగా రైడ్ చేశామని ఆ సమయంలో కొంతమంది డాన్స్ చేస్తున్నారు.

కొందరు ఫామ్ హౌజ్ చెట్ల మధ్య లో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎండీఎంఏ పిల్స్, కొకైన్, హైడోగాంజా వంటి డ్రగ్స్ అక్కడ లభించాయని పేర్కొన్నారు. నిందితుడు A-1 వాసు తన ఫ్యామిలీ ఫ్రెండ్.. A6 గోపాల్ రెడ్డిని సంప్రదించి పార్టీ ఏర్పాటు చేయాలని కోరాడు. గోపాల్ రెడ్డి తన GR ఫామ్ హౌస్‌ లో పార్టీ చేసుకోమని చెప్పడంతో.. A2 అరుణ్ కుమార్ పార్టీ ఏర్పాట్లను చూసుకున్నాడు. నాగబాబు, రణధీర్ బాబు ఈ పార్టీ కోసం డ్రగ్స్ ఆరెంజ్ చేశారు. ఎండీఎంఏ ఏక్, టీసీ, పిల్స్, ఎండీఎంఏ క్రిస్టల్, కొకైన్, హైడోగంజా వంటి డ్రగ్స్ ఈ పార్టీకి తీసుకొచ్చారని ఎఫ్ఐఆర్ లో ఉంది.

ఇక పార్టీకి పలువురు ప్రముఖులను ఆహ్వానం అందించారని, అలా వచ్చిన అందరికీ డ్రగ్స్ తీసుకోమని వాసు చెప్పినట్టు పేర్కొన్నారు. ఆ అనంతరం కొందరు నేరుగా.. మరికొందరు 500 నోటు తో కొకైన్ తీసుకున్నట్లు గుర్తించాం, రణధీర్ బాబు కారులో కూడా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం, పులికేశినగర్‌ లోని సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ లో డ్రగ్ టెస్టులు చేశాం. అందులో 68 మంది యువకులు, 30 మంది యువకులకు పాజిటివ్ వచ్చింది. నిందితులపై 242/2024, 290, 294 .. & 8(c), 22(b), 22(c), 22(A), 27 (B), 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.