NTV Telugu Site icon

Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!

Office Romance Video

Office Romance Video

ఆయన ఓ ప్రజాప్రతినిధి. ఆమె ఓ ఉద్యోగిని. తామున్న స్థాయి దృష్ట్యా.. వాళ్లిద్దరు బాధ్యతతో, మంచి నడవడికతో మెలగాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. కానీ.. వాళ్లేం చేశారు? దారి తప్పారు. శారీరక సుఖం కోసం తమ బాధ్యతల్ని, కుటుంబ గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఆఫీసులోనే సరసా సల్లాపాలు కొనసాగించారు. అయితే.. తామున్న సీసీటీవీ కెమెరా ఉందని వాళ్లు గ్రహించలేకపోయారు. దీంతో, వారి అక్రమ వ్యవహారం బట్టబయలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్ళి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ ఆఫీసులో పని చేస్తోన్న మహిళా ఉద్యోగిని, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ కొంతకాలం నుంచి ప్రేమాయణం నడుపుతున్నారు. ఇన్నాళ్లూ గుట్టుగానే తమ ఎఫైర్ వ్యవహారాన్ని కొనసాగించారు. అయితే.. ఇటీవల ఆఫీసులో ఎవరూ లేని సమయం చూసి, ముద్దుమురిపాలకు దిగారు. విచ్చలవిడిగా రొమాన్స్ చేసుకున్నారు. తాము రొమాన్స్ చేసుకుంటోన్న గదిలో సీసీటీవీ కెమెరాలున్న సంగతిని వారు మరిచిపోయారు. రొమాన్స్ చేసుకున్నాక, ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు ఎవరు పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు.

సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ దృశ్యాల్ని ఎవరో లీక్ చేయడంతో.. వారి అక్రమ తతంగం బయటపడింది. ఫుటేజీపై ఉన్న తేదీలను బట్టి చూస్తే.. మే 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ వ్యవహారం జరిగినట్టు తెలుస్తోంది. వీళ్ల ఎఫైర్ విషయం స్థానికంగా కలకలం రేపింది. వారిని అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరీ, ఆఫీసులోని కానివ్వాలా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Show comments