NTV Telugu Site icon

Bajrang Dal: “లవ్ జిహాద్” కోసం పబ్బులను వినియోగిస్తున్నారు.. న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలి.

Bajarang Dal

Bajarang Dal

Bajrang Dal wants ban on New Year parties in Mangaluru: హిందూ సంస్థ భజరంగ్ దళ్ న్యూఇయర్ పార్టీలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తుంది. కర్ణాటక రాష్ట్రం మంగళూర్ నగరంలో న్యూ ఇయర్ పార్టీలను బ్యాన్ చేయాలని కోరుతోంది. ఇందు కోసం భజరంగ్ దళ్ మంగళూర్ పోలీస్ కమిషనర్కు ఒక మొమోరాండం కూడా సమర్పించింది. ముస్లిం యువకులు ‘‘ లవ్ జిహాద్’’ కోసం బార్లు, పబ్బులను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. దీంతో మంగళూర్ వ్యాప్తంగా న్యూఇయర్ పార్టీలను నిషేధించాలని కోరింది. కొత్త సంవత్సరం సందర్భంగా బార్లు, పబ్బులను నిర్ణీత సమయంలోన మూసేయించాలని పోలీసులను భజరంగ్ దళ్ కోరింది.

Read Also: Police Round up 2022 : తగ్గిన నేరాలు.. పెరిగిన సైబర్‌ క్రైమ్‌ కేసులు

ఇదిలా ఉంటే ముస్లిం యువకులను పబ్ లు, హోటళ్లలోకి అనుమతించవద్దని భజరంగ్ దళ్ నగరంలోని పబ్ యజమానులను, నిర్వాహకులను కోరింది. ఈ సంస్థ నాయకుడు పునీత్ అత్తావర్ మాట్లాడుతూ.. ఇస్లాంలో మద్యం, సంగీతం నిషేధించబడ్డాయని.. కాబట్టి నూతన సంవత్సరం వేడుకలకు ముస్లింలు దూరంగా ఉండాలని అన్నారు.

ప్రస్తుతం మంగళూర్ వ్యాప్తంగా హెటళ్లు, పబ్ ల కారణంగా లవ్ జిహాద్, డ్రెస్ జిహాద్ కేసులు పెరిగిపోతున్నాయని.. ఈ స్థలాలు అక్రమాలకు కేంద్రం అవుతున్నాయని భజరంగ్ దళ్ ఆరోపించింది. ఇస్లాంలో పార్టీలు నిషేధించబడ్డాయని.. అయితే ప్రస్తుతం ఈ రోజుల్లో వారు అన్ని పబ్బుల్లో ఉంటున్నారని.. కాబట్టి ముస్లింలను డిసెంబర్ 31, న్యూఇయర్ వేడుకలకు అనుమతించవద్దని పబ్బుల యజమానులు, నిర్వాహకులను అభ్యర్థిస్తున్నామని భజరంగ్ దళ్ పేర్కొంది.