Bahraich violence: దుర్గా నిమజ్జనం వేళ ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్‌లో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రా అనే యువకుడిని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారులు హమీద్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు సర్ఫరాజ్, ఫహీమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. సర్ఫరాజ్, ఫకీమ్ నేపాల్‌కి పారిపోతున్న క్రమంలో సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ చేసి, నిందితులను గాయపరిచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసాకాండకు సంబంధించి మొత్తం 60 మంది వ్యక్తుల్ని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..
ఇదిలా ఉంటే, నిందితులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్ ఇళ్లు అక్రమ నిర్మాణం అంటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్(పీడబ్ల్యూడీ) నోటీసులు జారీ చేసింది. యువకుడి మృతికి దారి తీసిన హింసాత్మక ఘటనలో పొల్గొన్నందుకు హమీద్‌తో పాటు నలుగురు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
అబ్దుల్ హమీద్ ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం నిర్మించారని ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ రహదారిని ఆక్రమించి నిర్మించిన ఇంటిని మూడు రోజుల్లో కూల్చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మధ్యలో 60 అడుగుల ఎత్తులో ఉన్న నిర్మాణాన్ని తొలగించాలని పీడబ్ల్యూడీ ఆదేశించింది.