NTV Telugu Site icon

Derailment of Bagmati Express: తమిళనాడులో ట్రైన్ యాక్సిడెంట్.. 18 రైళ్లు రద్దు

Trains

Trains

Derailment of Bagmati Express: తమిళనాడు రాష్ట్రంలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్‌- దర్భంగా భాగమతి ఎక్స్ ప్రెస్‌ చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్‌ దగ్గర గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. దీంతో ఏకండగా 12 కోచ్‌లు పట్టాలు తప్పిపోయాయి. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయని రైల్వే అధికారులు చెప్పారు. అయితే, శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ప్రమాద సమయంలో 1, 360 మంది ప్రయాణికులు ట్రైన్ లో ఉన్నారని తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ టీ ప్రభుశంకర్‌ పేర్కొన్నారు. 19 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. అయితే, ట్రైన్ మెయిన్‌లైన్‌కు బదులు లూప్‌ లైన్‌లోనిక ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది.

Read Also: Dasara Puja 2024: దసరా శుభ సమయం.. పూజా విధానం.. మంత్రం..

అయితే, రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను క్యాన్సిల్ చేసింది. డా ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(16203), తిరుపతి-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌(16204), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-తిరుపతి(16053), తిరుపతి- ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌(16054), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-తిరుపతి(16057), తిరుపతి-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌(16058), తిరుపతి- పుదుచ్చేరి మెము(16111), పుదుచ్చేరి- తిరుపతి మెము(16112) ఉన్నాయి.

Read Also: Dussera 2024: దశమికి జ‌మ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి..?

అలాగే, తిరుపతి-అరక్కోణం మెము(06754), విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌(12711), ఎంజీఆర్‌ సెంట్రల్‌-విజయవాడ పినాకిని ఎక్స్‌ప్రెస్‌(12712) సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌(06745), నెల్లూరు-సూళ్లూరుపేట మెము ఎక్స్‌ప్రెస్‌(06746), అరక్కం-పుదుచ్చేరి మెము(16401), కడప-అరక్కోణం మెము(16402), డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి మెము(06727), , తిరుపతి-డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మెము(06728), అరక్కోణం-తిరుపతి మెము(06753) రైళ్లు రద్దయ్యాయి.

Show comments