Site icon NTV Telugu

భ‌క్తుల‌కు శుభ‌వార్త‌: 2023 చివ‌రినాటికి ఆ ఆల‌య నిర్మాణం పూర్తి…

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వివాదాస్ప‌దంగా ఉన్న ఆయోద్య రామాల‌య నిర్మాణం ప‌నులు ఎట్ట‌కేల‌కు వేగంగా సాగుతున్నాయి.  2019లో ఆయోద్య రామాల‌య నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్ప‌డంతో రామాల‌య నిర్మాణం ప‌నులు చేప‌ట్ట‌డానికి మార్గం సుగుమం అయింది.  ప్ర‌స్తుతం నిర్మాణం కొన‌సాగుతున్న‌ది.  అయితే, రామాల‌య నిర్మాణాన్ని 2023 చివ‌రి వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో పూర్తి చేయాల‌ని శ్రీరామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు నిర్ణ‌యించింది.  2023 చివ‌రి వ‌ర‌కు గ‌ర్భ‌గుడి నిర్మాణం పూర్తి చేయాల‌ని సంక‌ల్పించింది.  దానికి త‌గ్గ‌ట్టుగానే నిర్మాణం ప‌నులు జోరుగా సాగుతున్నాయి.  ఆల‌యంలోని మిగ‌తా నిర్మాణాల‌ను 2025 నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది ట్ర‌స్టు.  ఆల‌యంలో మొత్తం మూడు అంత‌స్తులు, ఐదు మండ‌పాలు ఉండ‌బోతున్నాయి.  360 అడుగుల పొడ‌వు, 235 అడుగుల వెడ‌ల్పుతో ఆల‌య నిర్మాణం ఉంటుంది.  ఇక ఒక్కో అంత‌స్తు ఎత్తు 20 అడుగులు ఉంటుంది.  ఆల‌యం కింది అంత‌స్తులో 160, మొద‌టి అంత‌స్తులో 132, రెండో అంత‌స్తులో 74 స్తంభాలు ఉంటాయి.  

Read: ఒలంపిక్స్ లో మాధురీ దీక్షిత్ పాట… వీడియో వైరల్

Exit mobile version