Site icon NTV Telugu

Viral Video: బైక్‌ రైడర్‌ హెల్మెట్‌ పగలగొట్టిన ఆటోరిక్షా డ్రైవర్‌.. ఎందుకో తెలుసా?

Auto Driver Smashes

Auto Driver Smashes

Autorickshaw Driver Smashes Helmet Of Bike Taxi Driver: బెంగళూరులో ఒక ఆటోరిక్షా డ్రైవర్.. విదేశీ బైక్ టాక్సీ రైటర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బైకర్ హెల్మెట్ పగలగొట్టడం, అతనిని దుర్భాషలాడడం, బెదిరించడం చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని ఇందిరా నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన బైక్ టాక్సీ డ్రైవర్, అగ్రిగేటర్ రాపిడోతో కలిసి పని చేస్తున్నాడు. తన వల్ల ఆటో డ్రైవర్లు తమ కస్టమర్లను కోల్పోతున్నారని ఆటో డ్రైవర్ చెప్పడం వీడియోలో వినపడుతోంది.

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. న్యూక్లియర్ ప్లాంట్‌లో నిలిచిన విద్యుత్..

అక్రమ రాపిడో వ్యాపారం ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.. ఈ వ్యక్తి వేరే దేశం నుంచి వచ్చి రాజులా తిరుగుతున్నాడు. ఇది ఆటో పరిశ్రమకు ముప్పుగా పరిణమిస్తోందని అని ఆటో డ్రైవర్‌ చెప్పాడు. బైకర్ హెల్మెట్ పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాతో పోస్ట్ చేశాడు. అది వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో పై కేసు నమోదుచేసి చేశాడు. ఈ ఘటనపై ఇందిరానగర్ పోలీసులు విచారణ చేపట్టారు. కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Bison : ఆరువేల ఏళ్ల తర్వాత పుట్టిన అడవి దున్న.. మాజీ ప్రధాని పేరు పెట్టుకున్న స్థానికులు

Exit mobile version