NTV Telugu Site icon

Delhi New CM: ఈ నెల 21న ఢిల్లీ సీఎంగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం..

Aap

Aap

Delhi New CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21వ తేదీన అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతిషితో ముఖ్యమంత్రిగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయుంచనున్నారు. అతిషితో పాటు మంత్రులుగా పలువురు నేతలు ప్రమాణం చేయనున్నారు. సెప్టెంబర్ 17న సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిషి ఎన్నిక అయ్యారు. ఇక, అతిషి ఢిల్లీ అసెంబ్లీలోని కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్త సర్కార్ లో ఎవరికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కేబినెట్‌లో పాత మంత్రులతో పాటు మరో కొత్త వారికి సైతం అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న పదవులతో పాటు ప్రాంతీయ, కుల సమీకరణాలను కూడా లెక్కలోకి తీస్కోని ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తుంది.

Read Also: Kolkata Case: కోల్‌కతాలో డాక్టర్ల నిరసనకు ముగింపు ఎప్పుడంటే ?

అలాగే, ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె పని చేయనున్నారు. గతంలో ఢిల్లీకి మహిళా సీఎంలుగా సుష్మాస్వరాజ్, షీలా దీక్షిత్ పని చేశారు. కాగా, 15 సంవత్సరాల 25 రోజుల పాటు ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ కొనసాగారు. 1998లో 52 రోజుల పాటు ఢిల్లీ సీఎంగా సుష్మాస్వరాజ్ బాధ్యతలు నిర్వహించారు. కాగా, ఇప్పుడు అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Show comments