Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Atiq Ahmeds Journey 1st Murder Case At 17 Stint As Mp Killed On Camera

Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..

Published Date :April 16, 2023 , 3:38 pm
By Venu Goapl Reddy
Atiq Ahmed: 17 ఏళ్లకే మర్డర్.. 27 ఏళ్లకు ఎమ్మెల్యే.. 44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Atiq Ahmed: అతిక్ అహ్మద్ ఒకానొక సమయంలో ఉత్తర్ ప్రదేశ్, ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో తిరుగులేని డాన్ గా ఎదిగాడు. చివరి రోజులను మాత్రం సీఎం యోగి ఆదిత్య నాథ్ దెబ్బకు బయపడుతూ బతికాడు. ఉత్తర్ ప్రదేశ్ వస్తే ఎప్పుడు ఎన్ కౌంటర్ అవుతానో అని తీవ్రంగా భయపడేవాడు. శనివారం రాత్రి ముగ్గురు నిందితుల చేతిలో అతిక్ అహ్మద్ తో పాటు అతని తమ్ముడు అష్రఫ్ అహ్మద్ దారుణంగా హత్యకు గురయ్యారు.

17 ఏళ్లకే మర్డర్ కేసు..

17 ఏళ్లకే తొలి మర్డర్ చేసిన అతిక్ అహ్మద్, 1962లో అలహాబాద్‌లో (ఇప్పుడు ప్రయాగ్‌రాజ్) జన్మించిన అతిక్ అహ్మద్ తన బాల్యాన్ని పేదరికంలో గడిపాడు. అతని తండ్రి బతుకుదెరువు కోసం పట్టణంలో గుర్రపు బండి నడిపేవాడు. చిన్న వయసులో చాలా పేదరికం అనుభవించడంతో డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడుతూ క్రిమినల్ గా మారాడు. ప్రయాగ్ రాజ్ తో భూకబ్జా సిండికేట్ కు డాన్ గా ఎదిగాడు. గ్యాంగ్ స్టర్ గా పొలిటీషియన్ గా మారాడు. ఇతడిపై 100కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఆధారాలు లేకపోవడం, బాధితుతలు అతిక్ అహ్మద్ భయానికి ఫిర్యాదు చేయకపోవడంతో నేరాలు చేసుకుంటూ వెళ్లాడు.

హత్యలు, కిడ్నాప్ ఇలా పలు కేసులు అతడిపై ఉన్నాయి. 27 ఏళ్ల వయసులో తొలిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచాడు. ఆ తరువాత ఇదే స్థానం నుంచి వరసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సమాజ్ వాదీ(ఎస్పీ) పార్టీ తరుపు పోటీ చేస్తూ గెలిచాడు. ఎస్పీ కాదనడంతో అప్నాదళ్ లో చేరాడు. మళ్లీ 2004లో ఎస్పీలో చేరి పూల్పూర్ ఎంపీగా గెలిచాడు. 2009 నుంచి ఎక్కడా గెలవలేకపోయాడు. చివరిసారిగా 2019లో ప్రధాని మోదీపై పోటీగా వారణాసి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

రాజుపాల్ హత్యతో బిగిసిన ఉచ్చు..

44 ఏళ్ల క్రిమినల్ హిస్టరీ కలిగి ఉన్న అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు కూడా నేరాల్లో పాలుపంచుకున్నారు. తమ్ముడు అష్రాఫ్, భార్య షాహిస్తా పర్వీన్, ముగ్గురు కొడుకులు కూడా క్రిమినల్ నేరాల్లో నిందితులే. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ ను హత్య చేసిన కేసులో బలమైన సాక్షాలు దొరకడంతో అప్పటి నుంచి ఈ గ్యాంగ్ స్టర్ డౌన్ ఫాల్ ప్రారంభం అయింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉమేష్ పాల్ ఉన్నాడు. ఇతడిని ఈ ఏడాాది ఫిబ్రవరిలో అయన కొడుకులు అనుచరులు కలిసి హత్య చేశారు. 2006లో సాక్షి అయిన ఉమేష్ పాల్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో ఇటీవల ఇతడికి జీవితఖైదు పడింది. ప్రస్తుతం ఉమేష్ పాల్ హత్య విచారణ జరుగుతోంది.

ఎన్ కౌంటర్ భయం..

ఉమేష్ పాల్ హత్య అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో ‘‘మాఫియాను మట్టిలో కలిపేస్తా’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ హత్యలో పాల్గొన్న ఇద్దర్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న అతీక్ కొడుకు అసద్ ను ఝాన్సీలో పోలీసులు ఎన్ కౌంటర్ లో రెండు రోజుల క్రితం మరణించాడు. కొడుకు మరణంతో కోర్టులోనే అతీక్ అహ్మద్ ఏడ్చాడు. తన కొడుకు మరణానికి నేనే కారణం అని అన్నాడు. తన కుటుంబాన్ని వదిలిపెట్టాలని పోలీసులను కోరాడు. అయితే రెండు రోజుల్లోనే హత్యకు గురయ్యాడు. అతీక్ గ్యాంగ్ లో మొత్తం 144 మంది సభ్యులు ఉన్నారని, రూ.11,000 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atiq Ahmed
  • Atiq Ahmed murder
  • CM Yogi Adityanath
  • Uttar Pradesh

తాజావార్తలు

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions