Elephant Attack: అస్సాం-మేఘాలయ సరిహద్దులో అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో అడవి ఏనుగు దాడిలో ఒక చిన్నారితో సహా కనీసం ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున అస్సాం-మేఘాలయ సరిహద్దులోని లఖిపూర్ సమీపంలోని కురంగ్ గ్రామంలో చోటుచేసుకుంది.
అటవీశాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మేఘాలయలోని సమీప కొండల ప్రాంతం నుంచి ఆహారం కోసం అడవి ఏనుగుల గుంపు అక్కడికి వచ్చి ప్రజలపై దాడి చేసింది.”ఏనుగుల దాడిలో ఒక చిన్నారితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ సంఘటన అస్సాం-మేఘాలయ సరిహద్దు ప్రాంతంలో జరిగింది” అని లఖిపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధృబా దత్తా తెలిపారు.
Indian Army Jawan: కనిపించకుండా పోయిన జవాన్.. 38 ఏళ్ల తర్వాత మృతదేహమై..
అడవి ఏనుగులు తరచూ ఈ ప్రాంతానికి వచ్చి ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. గత నెలలో గౌహతిలోని అమ్చింగ్ జోరాబత్ ప్రాంతంలో ఓ యువకుడిపై అడవి ఏనుగు దాడి చేసింది. మే నెలలో, అస్సాంలోని గోల్‌పరా జిల్లాలో ఇద్దరు మహిళలతో సహా ఒకే కుటుంబంలోని ముగ్గురిని అడవి ఏనుగులు తొక్కి చంపాయి. గోల్‌పరా జిల్లాలోని లఖిపూర్ అటవీ రేంజ్ పరిధిలోని సల్బరి అంగ్తిహార గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
