దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు యూపీ, గోవా లో పోలింగ్ ప్రారంభం కాగా, ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 3 రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది. అయితే మూడు రాష్ట్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పటిష్ట భద్రత మధ్య ఓటింగ్ కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల వరకు గోవాలో 11.04 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 9.45 శాతం, ఉత్తరాఖండ్‌లో 5.15 శాతం ఓటింగ్ నమోదయింది. యూపీ, గోవాలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, దేవభూమి ఉత్తరాఖండ్‌లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది.
Assembly Elections : పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు..
