NTV Telugu Site icon

ఎల్జేపీలో ముదిరిన విబేధాలు.. చిరాగ్ సోద‌రుడిపై లైంగిక‌దాడి కేసు..

Prince Raj Paswan

బాబాయ్‌, అబ్బాయ్ మ‌ధ్య త‌లెత్తిన విబేధాలు లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ (ఎల్‌జేపీ)లో తారాస్థాయి చేరుకున్నాయి.. కేంద్ర మాజీ మంత్రి, దివంగ‌త నేత రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను ఎల్జేపీ అధ్యక్ష పదవి నుంచి తొల‌గించే విధంగా అత‌డి బాబాయ్, ఎంపీ ప‌శుప‌తి కుమార్ ప‌రాస్ పావులు క‌దిపారు.. ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు.. లోక్‌స‌భ స్పీక‌ర్‌ను క‌లిసి.. త‌మ నేత ప‌రాస్ అని విన్న‌వించారు.. ఇక‌, ఆ త‌ర్వాత బాబాయ్, అబ్బాయి మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే న‌డుస్తోంది.. ఈ నేప‌థ్యంలో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం తెర‌పైకి వ‌చ్చింది.. చిరాగ్ పాశ్వాన్ క‌జిన్ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై లైంగికదాడి కేసు న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.. ప్రిన్స్ రాజ్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని ఓ మ‌హిళ‌.. ఫిర్యాదు చేసిన‌ట్లు ఢిల్లీ క‌న్నాట్ ప్లేస్ పోలీసులు వెల్ల‌డించారు.. మ‌రోవైపు.. ప్రిన్స్ లైంగిక వేధింపుల గురించి తాను పరాస్‌కు మార్చి 29వ తేదీన‌ లేఖ రాసినట్టుగా చెబుతున్న చిరాగ్ పాశ్వాన్.. ఇప్ప‌టికే ఆ లేఖ‌ను మీడియాకు కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెల‌సిందే.