NTV Telugu Site icon

Himanta Biswa Sarma: మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదు.. చరిత్రను తిరగరాయాలి..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Assam Chief Minister Himanta Biswa Sarma Comments On Rahul Gandhi over veer savarkar remarks:అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 600 ఏళ్లకు పైగా అస్సాంను పాలించిన అహోం రాజవంశానికి చెందిన లెజెండరీ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ వార్షికోత్సవ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీనికి హాజరయ్యారు హిమంత బిశ్వ శర్మ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వీర సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ ని ప్రశ్నించడం పాపం అని అన్నారు. స్వాతంత్య్రోద్యమంలో సావర్కర్ సహకారాన్ని ప్రశ్నించడం పాపమని.. ఈ పాపాన్ని రాహుల్ గాంధీ చేయకూడదని ఆయన అన్నారు.

Read Also: Sangareddy Accident: గోవా నుంచి వస్తూ తెలంగాణలో ప్రాణాలు కోల్పోయారు

మొఘలులు ఈశాన్య, దక్షిణ భారతాలను ఎన్నడూ జయించలేదని..చరిత్రను తిరిగి రాయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వామపక్ష చరిత్రకారులు మొఘల్ చక్రవర్తులు యావత్ దేశాన్ని పాలించినట్లు వక్రీకరించారని.. ఈశాన్య భారతదేశాన్ని, అస్సాంలను ఎన్నడూ జయించలేదని అన్నారు. యావత్ భారతదేశం మొఘలుల చేతిలో ఓడిపోయిందని అంచానా వేయడాన్ని ‘వామపక్ష కుట్ర’గా హిమంత బిశ్వ శర్మ అభివర్ణించారు. సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సావర్కర్ చాలా ఏళ్లు జైలులో ఉన్నారని.. అతను దేశానికి ఏం చేశాడని ప్రశ్నిస్తున్న వారు, ఆయన పాత్రను ప్రశ్నిస్తున్నవారు పాపం చేస్తున్నారని మండిపడ్డారు.

అంతకుముందు గురువారం, రాహుల్ గాంధీ మహారాష్ట్రలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణలు చెబుతూ.. నమ్మకస్తుడిగా ఉంటానని లేఖ రాశారని.. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నేతలకు ద్రోహం చేశారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన, బీజేపీ పార్టీలు రాహుల్ గాంధీపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే రాహుల్ వ్యాఖ్యలపై థానేనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. స్థానికులు మనోభావాలు దెబ్బతిన్నాయని శివసేన నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు నమోదైంది.