NTV Telugu Site icon

Assam: అస్సాంలోకి పౌల్ట్రీ, పందుల రవాణాపై నిషేధం..

Pigs, Poultry

Pigs, Poultry

Assam: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందుతుండటంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్లు, పందుల రవాణాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అస్సాం. అస్సాం పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ మంత్రి అతుల్ బోరా శనివారం మాట్లాడుతూ..అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కోళ్లు, పందులలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Read Also: FIRE ACCIDENT : యూపీలో దారుణం.. గుడిసెకు మంటలు.. ఐదుగురు సజీవదహనం..

కోళ్లు, బాతులు, పందుల రవాణాపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. జనవరిలో మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 700 పందులను చంపింది. అంతకుముందు కేరళ, యూపీ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వ్యాధులు బయటపడ్డాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అనేది పందులకు సోకే అత్యంత అంటువ్యాధి. ఇది సోకితే పెద్ద ఎత్తున పందుల మరణాలు సంభవిస్తాయి. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది స్వైన్ ఫ్లూకి భిన్నమైన వ్యాధి. ఈ వైరస్ ప్రజలను ప్రభావితం చేయదు. మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపించదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా కోళ్లు, బాతులు, పక్షలకు సోకే అంటువ్యాధి. దీన్ని బర్డ్ ప్లూగా పిలుస్తుంటారు. దీని వల్ల మనుషులు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.