NTV Telugu Site icon

Assam: అస్సాం సర్కార్ కీలక నిర్ణయం.. బీఫ్‌ విక్రయాలపై నిషేధం

Assamcmhimanta

Assamcmhimanta

అస్సాం సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బీఫ్‌ విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అస్సాంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసం వడ్డించడం మరియు తినడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినట్లు ముఖ్యమంత్రి బుధవారం ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Delhi: అమిత్ షాను కలిసిన ప్రియాంకాగాంధీ.. దేనికోసమంటే..!

గతంలో దేవాలయానికి ఐదు కిలోమీటర్ల మేర బీఫ్‌ విక్రయాలను నిషేధించింది. తాజాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. 2021 పశు సంరక్షణ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక పబ్లిక్ ఫంక్షన్లలో గానీ.. పబ్లిక్ ప్లేస్‌లో గానీ బీఫ్ తినకూడదని సూచించింది. బిల్లులోని నిబంధనలను ఉల్లంఘిస్తే మూడు నుంచి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

 

Show comments