criminal beaten to death by mob after fleeing custody: అత్యాచారం కేసుతో పాటు ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని గ్రామస్తులు కొట్టిచంపారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని లఖింపూర్ లోని గిలమారా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలకిలి గ్రామంలో చోటు చేసుకుంది. రాజు బారువా అలియాస్ గెర్జాయ్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు తీసుకెళ్లిన క్రమంలో తప్పించుకున్నాడు. అయితే కిలకిల గ్రామంలోని ఓ వాగు దగ్గర దాక్కుని ఉండడాని గమనించారు కొంతమంది గ్రామస్తులు. అయితే పట్టుకున్న అతడిని పోలీసులకు అప్పగించే లోపే గ్రామస్తులంతా కలిసి కొట్టారు.
గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే నిందితుడు రాజుబారువా తీవ్రంగా గాయపడి ఉన్నాడు. ఈ క్రమంలో అతడిని స్థానిక ఆస్పత్రికి తలరించారు.. కానీ అప్పటికే గాయాల తీవ్రత ఎక్కవగా ఉండటంతో అతడు మరణించాడని లఖింపూర్ ఎస్పీ బీఎం రాజ్ ఖోవా తెలిపారు. 40 ఏళ్ల వయసున్న రాజు బారువా ఆ ప్రాంతంలో కరగుగట్టిన నేరస్తుడు. అతనిపై డజనుకు పైగా కేసులు ఉన్నాయి. అత్యాచారం, హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇతడి నేర కలాపాలపై స్థానికులకు బాగా తెలుసు ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని కొట్టి చంపిన గ్రామస్తుల గుర్తింపు జరుగుతుందని.. గుర్తు తెలియని వ్యక్తులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేశామని.. కొట్టి చంపిన గ్రామస్తుల గుర్తింపు జరుగుతుంది.. అయితే ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని ఎస్పీ తెలిపారు.
ఇటీవల రాజు బారువాతో పాటు మరో ఇద్దరు నేరస్తులు ఢకుఖానలోని కోర్టు నుంచి పోలీస్ కస్టడీ నుంచి పారిపోయారు. విచారణకు కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంలో ఎస్కేప్ అయ్యారు. ఇందులో బుధవారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయగా.. రాజు బారువా గ్రామస్తుల చేతిలో చనిపోయాడు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బారువా గత ఏడాది సెప్టెంబర్ లో పోలీసు ఎన్ కౌంటర్ లో గాయపడ్డాడు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేర్పిస్తే అక్కడి నుంచి పారిపోయాడు.. ఆ తరువాత మళ్లీ పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ సారి కూడా పారిపోయాడా..అయితే గ్రామస్తులకు చిక్కి కుక్కచావు చచ్చాడు.