Site icon NTV Telugu

Asaduddin Owaisi: మాంసం దుకాణాల మూసివేతపై అసదుద్దీన్ ఫైర్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi’s comments on PM Narendra Modi: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర నేపథ్యంలో యాత్ర మార్గంలో మాంసం దుకాణాలు మూసివేయడంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కన్వర్ యాత్రంలో భాగంగా యాత్ర మార్గంలోని మాంసం దుకాణాలను జూలై 18 నుంచి జూలై 27 వరకు మూసివేయాలని ఆదేశించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై అసదుద్దీన్ విరుచుకుపడ్డారు. మత మనోభావాల కోసం మాంసం దుకాణాలను మూసివేశారు.. అయితే మాంసం నుంచి డబ్బు సంపాదించడానికి మోదీకి ఎటువంటి సమస్య లేదని ఆయన విమర్శించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం భీఫ్, బఫ్ తో సహా మాంసాన్ని దిగుమతి చేయాలని భారత్ ను కోరిందని అక్కడి మీడియా నివేదించిందన నేపథ్యంలో ఈ విషయాన్ని అసదుద్దీన్ ప్రస్తావిస్తూ.. సంఘీలు మామూలుగా ముస్లిం పశువుల వ్యాపారులపై దాడులు చేస్తారని.. రాష్ట్ర ప్రభుత్వాలు బీఫ్ ను నిషేధిస్తాయని.. ఇక్కడ కబేళాలను మూసివేస్తాయని.. అయితే ప్రభుత్వం మాత్రం పెద్ద మాంసం వ్యాపారులకు మాత్రం సహాయం చేస్తుందని.. డబ్బులు సంపాదిస్తుందని విమర్శించారు.

Read Also: Business Flash: దటీజ్‌ ఇండియన్ ఎకానమీ. కనిపించని ప్రపంచ అనిశ్చితుల ప్రభావం

కన్వర్ యాత్ర జూలై 14న ప్రారంభమై జూలై 26న ముగుస్తుంది. దీంతో కన్వర్ యాత్ర మార్గంల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న మాంసం దుకాణాలను, దేవాలయాలు జూలై 18 నుంచి జూల 27 వరకు మూసివేయబడతాయని ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై వివాదం నడుస్తోంది. కోవిడ్ మహమ్మారి వల్ల గత రెండేళ్లుగా కన్వర్ యాత్ర జరగలేదు. ఈ ఏడాది తిరిగి మళ్లీ ప్రారంభం అయింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. శివుడి భక్తులైన ‘కన్వరియాలు’ గంగా నది నుంచి నీటిని తీసుకువచ్చి.. తమ ఇళ్లలో, దేవాలయాల్లో సమర్పిస్తారు.

Exit mobile version