Asaduddin Owaisi: జ్ఞానవాపిపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ మౌనం ఎందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదుపై రచ్చ నడుస్తోంది. వారణాసి కోర్ట్ మసీదు వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. ఓ వర్గం వారు కోర్ట్ ఆదేశాలను వ్యతిరేఖిస్తున్నారు. మసీదు మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసి ఈనెల 17న రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోర్ట్ కమిషనర్ ను ఆదేశింది. మసీదు వెలపల గోడపై హిందూ దేవత విగ్రహాలు ఉన్నాయని.. మాకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించడంతో కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే జ్ఞానవాపి చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది.
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోర్ట్ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నారు. గతంలో బాబ్రీని వదులుకున్నాం… మళ్లీ జ్ఞానవాపిని వదులుకోవడానికి సిద్ధంగా లేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గుజరాత్ అహ్మదాబాద్ లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు రాజకీయ విమర్శలు చేశారు. జ్ఞానవాపి విషయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయంటూ నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఎస్పీ పార్టీలు మతోన్మాద పార్టీలని విమర్శించారు. ముస్లింలు ఇళ్లలోనే ముస్లింలుగా ఉండాలని.. బయటకు వస్తే వారి పార్టీల సంస్కృతిని అంగీకరించాలని వారు కోరుకుంటున్నారని అసదుద్దీన్ విమర్శించారు.
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ద్వారా మేం మా సంస్కృతిని కొనసాగిస్తామని అన్నారు. బాబ్రీ మసీదును కుతంత్రం ద్వారా న్యాయాన్ని హత్య చేయడం ద్వారా లాక్కున్నారని.. మళ్లీ జ్ఞానవాపిని కోల్పోమని చెప్పడానికే ఇక్కడ ఉన్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థన స్థలంలోని మతపరమైన స్వభావం మారదని.. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం చెబుతోందని.. దాని స్వభావాన్ని మార్చేందుకు ప్రయత్నించే వారికి మూడేళ్లు శిక్ష విధించ వచ్చని ఓవైసీ అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?