Annamalai: బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై పదవీ కాలం జూలై 17తో ముగియనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్నామలై కొన్ని రోజుల పాటు రాజకీయాలకు విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల ఆక్స్‌ఫర్డ్ ఫెలోషిప్ కోసం ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చెవెనింగ్ ఫెలోషిఫ్ ఫర్ లీడర్‌షిప్ అండ్ ఎక్స్‌లెన్స్ ప్రోగ్రామ్ కోసం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆఫర్ చేసింది. ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికైనందున ఆయన తన రాజకీయ జీవితానికి మూడు నెలల రాజకీయాలకు అందుబాటులో ఉండకపోవచ్చు.
Read Also: Google Account Storage Full : గూగుల్ అకౌంట్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా.. ఐతే ఇలా ట్రై చేయండి..
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడుపై చాలా ఆశలు పెట్టుకుంది. ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 2-3 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ, చివరకు అన్నామలై పోటీ చేసిన కోయంబత్తూర్ స్థానంలో గెలవలేకపోయారు. ఆ రాష్ట్రంలోని 39 స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక్క సీటును కూడా డీఎంకే, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అయితే, ఈసారి బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. 019లో ఐదు స్థానాల్లో పోటీ చేసినప్పుడు 3.66 శాతం ఉన్న ఓట్ల శాతం, 2024లో 24 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 10.72 శాతానికి పెరిగింది. మిత్రపక్షాలతో కలిసి ఓట్ల శాతం 18.2 శాతంగా ఉంది. 9 స్థానాల్లో రెండోస్థానంలో నిలిచింది.
ఎన్నికల ఫలితాల కన్నా ముందు నుంచే ఈ ఫెలోషిప్ అనేది ఉంది. అయితే, అన్నామలై ఫెలోషిప్ అంగీకరించడానికి పార్టీ హైకమాండ్ అనునమతి కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఫెలోషిఫ్ మూడు నెలలు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ఇటీవల ఎన్నికల్లో ఓటమితో తమిళనాడు అధ్యక్షుడిని బీజేపీ మారుస్తుందా..? లేక అన్నామలైనే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తుందా..? అనే దానిపై హైకమాండ్ నిర్ణయం ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది.