NTV Telugu Site icon

Arvind Kejriwal: రేపు బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై సోమవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారు. దీనిపై పోలీస్ విచారణ జరుగుతోంది. ఈ అరెస్ట్ వ్యవహారంపై బీజేపీ, ఆప్ పార్టీల మధ్య రాజకీయంగా విమర్శలు జరుగుతున్నాయి. ఆదివారం తన పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఆప్ నేతలు, కార్యకర్తలతో వెళ్తానని, అధికార పార్టీ దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.

స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కొద్దిసేపటికి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ప్రధాని మోడీ, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్‌ని ఒక్కోక్కరిగా జైల్లో పెట్టి ఆట ఆడుతున్నారు, నేను నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాని వస్తాం, మీరు ఎవరిని జైలులో పెట్టాలనుకుంటే, వారందరికి ఒకే సారి అరెస్ట్ చేయవచ్చు’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Read Also: Sugar in Childhood: రెండేళ్లలోపు పిల్లలకు చక్కెర తినిపించొద్దు.. దాని వల్ల కలిగే నష్టాలు ఇవే!

‘‘సంజయ్ సింగ్‌ని జైల్లో పెట్టారు. ఈ రోజు నా సహాయకుడిని(బిభవ్ కుమార్) జైలులో పెట్టారు. ఇప్పుడు రాఘవ్ చద్ధా లండన్ నుంచి తిరిగి వచ్చాడు, అతడిని కూడా జైల్లో పెట్టండి. సౌరభ్ భరద్వాజ్‌ని, అతిషిని జైల్లో పెడుతామని చెబుతున్నారు’’ అని కేజ్రీవాల్ ఎక్స్ వేదిగా ఒక వీడియోను ట్వీట్ చేశారు. అధికార పార్టీ ఆప్ నేతలందర్ని ఎందుకు జైల్లో పెట్టాలనుకుంటుంది..? అని ప్రశ్నించారు.

ఢిల్లీలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడం, మొహల్లా క్లినిక్‌లని సృష్టించడం, మందులు, వైద్యం అందించడం మా తప్పు అని అన్నారు. తమ నేతల్ని జైలులో పెట్టి ఆప్‌ని తొక్కేయాలని బీజేపీ భావిస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్‌ని ఎవరూ నలిపేయలేరు, ఇప్పుడు ఆప్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న ఆలోచన అని కేజ్రీవాల్ అన్నారు.