Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ విచారణ ముగిసింది. దాదాపుగా 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సీఆర్పీసీ 161 కింద లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డ్ చేసుకున్నారు. సాక్షిగానే కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. లిఖిత పూర్వకంగా మౌఖికంగా ఆయన నుంచి సీబీఐ అధికారులు సమాధానాలు తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరా పర్యవేక్షణలో స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు.
Read Also: Harish Rao: కర్ణాటక ఎన్నికలపై హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ప్రభుత్వమే రావాలంటూ..
లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, సీఎంగా కేజ్రీవాల్ పాత్ర గురించి ప్రశ్నించారు. దీంతో పాటు రూ.100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ తో పాటు ఇతర నిందితులతో ఉన్న సంబంధాలను అడిగారు. మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయానికి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ సంబంధాలు, ఎక్సైజ్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలులో ఉన్నాడు. ఇటీవల శుక్రవారం ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆదివారం విచారణకు రావాలని పిలిచింది. ఈ నేపథ్యంతో ఆప్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కావాలనే బీజేపీ కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని ఆరోపించారు.
