Site icon NTV Telugu

Arvind Kejriwal: గతంలో ఇందిరా గాంధీ.. ఇప్పుడు ప్రధాని మోదీ

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ మద్యంపాలసీలో ఎలాంటి తప్పు లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం పనిచేశారని, అందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని, మంచి పని జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన మంచి పనిని ఆపడానికే తన క్యాబినెట్ మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లను కటకటాల వెనక్కి నెట్టారని అన్నారు. అవినీతిని ఆపడం వారి ఉద్దేశ్యం కాదని, ఢిల్లీలో చేసిన మంచి పనిని ఆపడం వారి ఉద్దేశం అని బీజేపీపై విమర్శలు గుప్పించారు. గతంలో ఇందిరా గాంధీ ప్రతిపక్షాలపై వ్యవహరించినట్లే ప్రస్తుతం ప్రధాని మోదీ, బీజేపీ ప్రతిపక్షాలను అణిచివేస్తోందని దుయ్యబట్టారు.

Read Also: Satvik Suicide Note: కన్నీళ్లు పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ నోట్‌.. ఆ నలుగురిని వదలొద్దంటూ..

సిసోడియా నివాసంలో గంటల తరబడి దాడులు చేసిన సీబీఐ అధికారులు రూ.10,000 కూడా రికవరీ చేయలేకపోయారని కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా బీజేపీలో చేరితే రేపటిలోగా ఆయన జైలు నుంచి విడుదల కాలేరా..? అని ప్రశ్నించారు. ఈ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఇంటింటి ప్రచారం చేస్తుందని ఆయన వెల్లడించారు. సిసోడియా దేశం గర్వించేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దారని పేర్కొన్నారు.

పంజాబ్ రాష్ట్రంలో ఆప్ గెలిచిన తర్వాత బీజేపీ తట్టుకోలేకపోతోందని, సిసోడియా, సత్యేందర్ జైన్ బీజేపీలో చేరితే వారిపై ఎలాంటి కేసులు ఉండవని అన్నారు. ఆప్ ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, మా పార్టీని ఎవరూ ఆపలేరని కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ స్కామ్ కేసుతో ఆప్ పై ఆరోపణలు చేస్తున్నారని, 20 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ చేపడుతాం అని సీఎం వెల్లడించారు.

Exit mobile version