NTV Telugu Site icon

Arvind Kejriwal: ఈడీ అధికారులపై కేజ్రీవాల్ నిఘా..?

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నిన్న సాయంత్ర కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన కస్టడీ కోసం రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

ఇదిలా ఉంటే నిన్న జరిగిన తనఖీల్లో పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేజ్రీవాల్ ఈడీ అధికారులపై గూఢచర్యం చేస్తున్నట్లు ఈ పత్రాలు చూపించాయని తెలుస్తోంది. కేజ్రీవాల్ నివాసంలో సోదాల సమయంలో సుమారు 150 పేజీల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. డాక్యమెంట్లలో ఈడీ టాప్ అధికారుల్లో ఇద్దరి గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోదాల సమయంలో అధికారుల ప్రత్యేక డైరెక్టర్ ర్యాంక్ అదికారి, జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన సమాచారం కలిగిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇద్దరు అధికారులు గుర్తింపు బయటకు వెళ్లడించలేదు.

Read Also: Radhika: బీజేపీ ఎంపీగా రాధిక.. అక్కడి నుంచే పోటీ

సెర్చ్ సమయంలో ఉన్నతాధికారి వివరాలు ఉండటంతో మిగతా అధికారులు షాక్ అయినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లో కనిపించిన పేరున జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అదికారి ప్రస్తుతం మద్యం పాలసీ కుంభకోణంపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. డాక్యుమెంట్ లోని అంశాలు మోసానికి సంబంధించిన ఆంశాలను లేవనెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ చూస్తే ఈడీ అధికారులపై గూఢచర్యం చేశారనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని, అయితే డాక్యుమెంట్లలోని ఖచ్చితమైన స్వభావం బహిర్గతం కానప్పటికీ, ఇవి ఈదీ సమగ్రత, భద్రతా ప్రోటోకాల్‌లపై ఆందోళనలను లేవనెత్తుతున్నాయి.