Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ట్రోలింగ్.. #MannerlessCM అంటూ విమర్శలు

Aravind Kajriwal

Aravind Kajriwal

సోషల్ మీడియాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్‌కు మర్యాద తెలియదని మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. బుధవారం నాడు ప్రధాని మోదీ కరోనా పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇందులో పాల్గొన్నారు.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతుండగా.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. ఓ వైపు ప్రధాని మాట్లాడుతుండగానే.. కేజ్రీవాల్ తన చేతులు రెండు పైకెత్తి తలపై పెట్టుకున్నారు. కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్.. ఆయన ప్రదర్శించిన తీరు, హావభావాల దృశ్యాలు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో రికార్డు అయ్యాయి. దీంతో ఆయన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రధాని మోదీతో ఎలా ప్రవర్తించాలో తెలియదా అని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మాటలు పట్టించుకోకుండా వినలేక వింటున్నట్లు కేజ్రీవాల్ బాడీ లాంగ్వేజ్ కనిపించిందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో #MannerlessCM అంటూ విమర్శలు చేస్తున్నారు.

Video Conference

Exit mobile version