NTV Telugu Site icon

Kejriwal: కేజ్రీవాల్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావొచ్చు.. మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్

Atishi

Atishi

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్ 8.5 కిలోలు తగ్గిపోయారని ఆ పార్టీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆప్ మంత్రి అతిషి సంచలన ప్రెస్‌మీట్ పెట్టారు. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని.. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ అధికారులు ఖండించారు. ఈ నేపథ్యంలో తాజాగా అతిషి స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఇంట్లో రావణుడికి గుడి కట్టి పూజలు చేస్తున్న 80 ఏళ్ల వృద్ధుడు..

తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ మంత్రి అతిషి ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహ రోగులకు కోమా మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలు రావొచ్చన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. తీహార్ జైలు అధికారులు బీజేపీ పత్రాలను విడుదల చేస్తోందని ఆమె విమర్శించారు. తీహార్ జైలులో సీఎం ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Off The Record : వైసీపీ ఒంగోలు నేతలు గరంగరం..?

ఇదిలా ఉంటే ఆరోపణలు తీహార్ జైలు అధికారులు తోసిపుచ్చారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖకు వారు పంపిన నివేదిక ప్రకారం.. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో కేవలం 2 కిలోలు మాత్రమే తగ్గారు. కేజ్రీవాల్ ప్రాణాధారాలు నిలకడగా ఉన్నాయని, ఆయనకు సాధారణ వైద్యం మరియు ఇంట్లో వండిన ఆహారం అందించబడుతుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Indias trade: విదేశాల్లో భారతీయ వస్తువులకు డిమాండ్..భారీగా పెరిగిన ఎగుమతులు