Kejriwal: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఢిల్లీలో పాలిటిక్స్ వేడెక్కాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతూ భారతీయ జనతా పార్టీ రౌడీయిజం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఆప్ విజయం సాధిస్తుందన్నారు. ఇది బీజేపీ నాయకులకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నచ్చడం లేదు.. అందుకే మాపై దాడులకు, బెదిరింపులకు దిగుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Read Also: Sanju Samson: సంజు శాంసన్ ఫామ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు..
ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆ పార్టీకి ఢిల్లీ అభివృద్ధిపై అజెండా లేదు.. ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా లేడని సెటర్లై వేశాడు. వారికి కేవలం రౌడీయిజం మాత్రమే తెలుసంటూ ఆరోపించాడు. ఢిల్లీ ప్రజలంతా ఎన్నికల్లో బీజేపీని ఓడించి మరోసారి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక, అంతకు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు ఆప్ అధినేత లేఖ రాశారు. తమ పార్టీ కార్యకర్తలపై కమలం పార్టీతో పాటు పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పాడు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే, న్యూ ఢిల్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎన్నికల పరిశీలకులను నియమించడంతో పాటు ఆప్ వాలంటీర్లకు భద్రత కల్పించాలని ఎలక్షన్ కమిషన్ ను అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.