NTV Telugu Site icon

AIIMS : పార్థ ఛటర్జీ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు.. ఆయన బాగానే ఉన్నారు..

Partha Chatterjee Doesn't Need Hospitalisation

Partha Chatterjee Doesn't Need Hospitalisation

AIIMS: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కానీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఒడిశా భువనేశ్వర్‌లోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపింది. తాము ఛటర్జీకి క్షుణ్ణంగా పరీక్షలు చేశామని.. ఆయనకు కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ బిస్వాస్ అన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదన్నారు.

స్కామ్‌కు సంబంధించి ఛటర్జీని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా పొరుగు రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని కోల్‌కతా హైకోర్టు జులై 24న ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఛటర్జీ ఆరోగ్యం గురించి ఈడీ కోర్టుకు తెలియజేయడంతో పాటు బెంగాల్ మంత్రిని 14 రోజుల కస్టడీకి కోరింది. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేసింది. అతని సహాయకురాలు అర్పితా ముఖర్జీ నుండి రూ.20 కోట్లు స్వాధీనం చేసుకున్న తర్వాత అరెస్టు జరిగింది, ఆమెను కూడా అరెస్టు చేశారు.

Partha Chatterjee: కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు

కాగా.. ఈ మొత్తం ఎస్సెస్సీ స్కామ్‌లో వచ్చిన డబ్బుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500ల రూ.2 వేల నోట్ల కట్టలే దర్శనమిచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమిషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్మెంట్ స్కామ్‌ విచారణలో కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.