CDS General Bipin Rawat: ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) దివంగత జనరల్ బిపిన్ రావత్ గౌరవార్థం అరుణాచల్‌లోని కిబితు మిలిటరీ గార్రిసన్‌కు ఆయన పేరు పెట్టారు. కిబితులోని సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు. చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖలోని లోహిత్ వ్యాలీలో ఉన్న ఈ సైనిక స్టేషన్‌ను ఇకపై జనరల్ బిపిన్ రావత్ స్టేషన్‌గా పిలవనున్నారు. అలాగే గ్రామ ప్రధాన రహదారికి కూడా ఆయన పేరు పెట్టారు. జనరల్ రావత్ గత ఏడాది డిసెంబర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో అతని భార్య మధులికా రావత్, మరో 12 మంది సైనిక సిబ్బందితో కలిసి మరణించారు.
Rubber Girl: వైకల్యం ఆమెను అడ్డుకోలేకపోయింది.. ప్రధాని మోడీని కలిసిన ‘రబ్బర్ గర్ల్’
సైనిక స్టేషన్ పేరు మార్చే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బ్రిగ్ బీడీ మిశ్రా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, దివంగత సీడీఎస్ కుమార్తెలతో పాటు సీనియర్ సైనిక. పౌర ప్రముఖులు పాల్గొన్నారు.కిబితు మిలిటరీ క్యాంప్‌ను జనరల్ బిపిన్ రావత్ మిలిటరీ గారిసన్‌గా మార్చారు, దీనిలో స్థానిక సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన గొప్ప గేట్‌ను గవర్నర్ ప్రారంభించారు.జనరల్ రావత్ 1999-2000 వరకు కిబితు వద్ద కల్నల్‌గా తన బెటాలియన్ 5/11 గూర్ఖా రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు, లోహిత్ లోయ ఒడ్డున ఉన్న ఒక చిన్న కుగ్రామమైన కిబితు భద్రతా నిర్మాణాన్ని పటిష్టపరచడంలో విపరీతంగా సహకరించారు. వాలాంగ్ నుంచి కిబితు వరకు 22 కి.మీ రహదారిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జనరల్ బిపిన్ రావత్ మార్గ్‌గా అంకితం చేశారు.