NTV Telugu Site icon

Missile Misfire: ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం..

Army Missile Misfires

Army Missile Misfires

Missile Misfire: రాజస్థాన్ జైసల్మేర్ లోని పోఖ్రాన్ వద్ద ఆర్మీ మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. ఆర్మీ యూనిట్ ఫీల్డ్ ప్రాక్టీస్ చేస్తుండగా మిస్సైల్ మిస్ ఫైర్ అయింది. భారత ఆర్మీ చెబుతున్నదాని ప్రకారం క్షిపణి విమానంలో పేలింది. పోఖ్రాన్ రేంజ్ లో ఈ ఘటన జరిగింది. క్షిపణి విమానంలో ఉండగా పేలింది. శిథిలాలు పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడిపోయాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఆర్మీ తెలిపింది. దీనిపై విచారణ ప్రారంభించారు.

Read Also: Rahul Gandhi: గాంధీ సిద్ధాంతాలకు ద్రోహం.. రాహుల్ గాంధీ శిక్షపై ఇండో-అమెరికన్ పొలిటీషియన్..

గతంలో బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు మిస్ ఫైర్ అయి పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్లింది. బ్రహ్మోస్ ఘటన జరిగి ఏడాది తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మోస్ మిస్ ఫైర్ విషయంలో ముగ్గురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కోర్టు విచారణ చేసి తొలగించారు. బ్రహ్మోస్ పై జాయింట్ ఎంక్వైరీ చేయాలని పాకిస్తాన్ కోరుతోంది. దీనికి భారత్ అభ్యంతరం తెలుపుతోంది.