NTV Telugu Site icon

Upendra Dwivedi: భారత్‌‌పై పాక్-చైనా కుట్రలు.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Upendradwivedi

Upendradwivedi

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్-చైనా కుట్రలు ఉన్నతంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్విదేది కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ రెండు దేశాల మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలను అంగీకరించాలన్నారు. పాక్-చైనా బంధం వంద శాతం ఉందని చెప్పారు. చైనాలో తయారైన మిలిటరీ ఉత్పత్తులు పాక్ వినియోగిస్తుందని చెప్పారు. రెండు వైపుల నుంచి యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం అని చెప్పారు.

ఇక వేసవిలో జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదని.. ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఉగ్రవాద కట్టడికి భారత సైన్యం గట్టి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సైన్యం గణనీయమైన పురోగతి సాధించిందని చెప్పారు. 2018 నుంచి ఉగ్రవాద సంఘటనల సంఖ్యను 83 శాతం తగ్గిందని తెలిపారు.