Site icon NTV Telugu

Rubber Girl: వైకల్యం ఆమెను అడ్డుకోలేకపోయింది.. ప్రధాని మోడీని కలిసిన ‘రబ్బర్‌ గర్ల్‌’

Rubber Girl

Rubber Girl

Rubber Girl: జీవితంలో ఎన్నో బాధలు ఉన్నప్పటికీ.. 75 శాతం మేధో వైకల్యంతో పాటు డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఓ 14 ఏళ్ల బాలిక జీవితాన్ని యోగా మార్చేసింది. ఆమె ఎవరో కాదు ‘రబ్బర్ గర్ల్’గా పేరొందిన అన్వీ విజయ్‌ జంజారుకియా. ఆమె నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని ముందు అన్వీ యోగాను ప్రదర్శించారు. ఆమె చేసిన యోగాసనాలను చూసి ప్రధాని మోడీ మెచ్చుకున్నారు. మంచి భవిష్యత్‌ను ఆ దేవుడు ప్రసాదించాలని ఆశీర్వదించారు. ఈ సారి గుజరాత్‌ వచ్చినప్పుడు ఆమెను కలుస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం అన్వీ గురించి ఆమె తండ్రి విజయ్ జంజారుకియా చెప్పుకొచ్చారు. అన్వీ తన భుజానికి కాళ్లు తాకించి నిద్రపోవడాన్ని మొదట తన భార్య గుర్తించిందని ఆయన తెలిపారు. అలా చేసినా కూడా తనకు నొప్పి తెలియకపోయేదని చెప్పారు. అప్పటి నుంచి ఆమె దేహంలోని ఈ లక్షణాలను గుర్తించి యోగా సాధన చేయమని ప్రోత్సహించినట్లు అన్వీ తండ్రి చెప్పారు. యోగా సాధన వల్ల ఆమెకు ఔషధాలపై ఆధారపడటం తగ్గిపోయిందని ఆయన అన్నారు. “ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం అన్వీ మిట్రల్ వాల్వ్ లీకేజీతో బాధపడుతోంది. 21 ట్రిసోమి, కఠినమైన ఓ వ్యాధి కారణంగా ఆమె పెద్ద ప్రేగులలో సమస్య ఉంది. ఆమె మాట్లాడడంలో కూడా ఇబ్బంది పడుతోంది.యోగా తమ కూతురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. రోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు యోగా సాధన చేస్తుందని.. పోటీల్లో ఇతర సాధారణ పిల్లలతో కలిసి ప్రదర్శనలిచ్చి ఎన్నో అవార్డులు గెలుచుకుందని..” ఆమె తల్లి అవనీ జంజారుకియా తెలిపారు.

West Bengal: కోల్‌కతాలో ఈడీ దాడులు.. ఓ వ్యాపారి ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలు

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అన్వీ 75 శాతం మేధో వైకల్యంతో పాటు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఆమె ఈ ఏడాది జనవరి 24న ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను గెలుచుకుంది. గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు సూరత్ నుండి ఢిల్లీకి వచ్చిన ఆమె తల్లిదండ్రులతో కలిసి, తరువాత వారు ప్రధానమంత్రిని కలవాలనే అభ్యర్థనతో ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. ధృవీకరిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి కాల్ రావడంతో వారు ఆశ్చర్యపోయారు. కల నిజమైందని.. ప్రధాని మోడీని కలిసి ఆయన ముందు యోగా చేయడం అద్భుతమైన దినం అంటూ అన్వీ తండ్రి విజయ్ జంజారుకియా అన్నారు. అన్వీ ప్రధాని నరేంద్ర మోదీని నమో దాదా అని పిలిచేవారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆమె తన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ సర్టిఫికేట్‌పై ప్రధాని మోదీ సంతకాన్ని కూడా పొందారు.

 

Exit mobile version