OTT platforms: OTT ప్లాట్‌ఫారమ్‌లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై ఓటీటీలో ప్రదర్శితమయ్యే సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రాంలలో పొగాకు వ్యతిరేఖ హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుంది.
Read Also: CM KCR: పేద బ్రహ్మణులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. భృతి పెంపు..
ఏదైనా ప్రోగ్రామ్ సమయంలో పొగాకు ఉత్పత్తులు, వాటి వినియోగానికి సంబంధించిన సీన్ వస్తే పొగాకుకు వ్యతిరేకంగా స్క్రీన్ దిగువన ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. పొగాకు వినియోగం వంటి సన్నివేశాలు మైనర్లపై కీలక ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో కూడా పొగాకుకు వ్యతిరేకంగా హెచ్చరికలను జారీ చేయాలని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
పొగాకు వల్ల వచ్చే వ్యాధుల తీవ్రత నానాటికి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిగరేట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులను(ప్రకటనల నిషేధం మరియు వాణిజ్యం మరియు వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ నియంత్రణ) COTPA చట్టాన్ని 2004లో అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఓటీటీలో పొగాకు నియంత్రణకు తీసుకువచ్చిన గైడ్ లైన్స్ ద్వారా పొగాకు నియంత్రణలో భారత్ గ్లోబల్ లీడర్ అవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
